Share News

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

ABN , Publish Date - May 25 , 2024 | 07:19 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
mallu ravi

హైదరాబాద్, మే 25: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఓ వైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. ఈ వ్యాఖ్యలు ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా ఉన్నాయని చెప్పారు. శనివారం గాంధీ భవన్‌లో మల్లు రవి మాట్లాడారు. ఆ కళాశాలలో చదివిన వారే పట్టభద్రులు మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడడం సరికాదని కేటీఆర్‌కు హితవు పలికారు.


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను కించ పరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటీ ఈ సందర్బంగా స్పష్టమైందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీన్మార్ మల్లన్న అర్హుడని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని మల్లు రవి గుర్తు చేశారు. చదివే డిగ్రీని తక్కువ చేయడం సరికాదని సూచించారు. తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తామని మల్లు రవి హెచ్చరించారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 07:51 PM