Share News

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

ABN , Publish Date - Feb 23 , 2024 | 10:08 AM

Telangana: మేడారం మహాజాతరలో పోలీసుల ఓవరాక్షన్‌ పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ పోలీసులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రధాన గద్దెలపైకి వారి కుటుంబాలను పంపిస్తున్నారు.

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

మేడారం, ఫిబ్రవరి 22: మేడారం మహాజాతరలో (Medaram Jatara 2024) పోలీసుల ఓవరాక్షన్‌ పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ పోలీసులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రధాన గద్దెలపైకి వారి కుటుంబాలను పంపిస్తున్నారు. డ్యూటీలు వదిలి మరీ పోలీసులు దర్శనానికి ఎగబడుతున్నారు. పదే పదే మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తున్నప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, వారి కుటుంబాలు జాతరలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీవీఐపీ వాహనాలను పార్కింగ్‌కు అనుమతించకున్నా... పోలీసుల పర్సనల్ వాహనాలకు మాత్రమే డ్యూటీ పోలీసులు అనుమతి ఇస్తుండం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 10:08 AM