Share News

Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:06 PM

Telangana: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్

వరంగల్, మార్చి 4: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Former Minister Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ (Praja Shanthi Party Chief KA Paul) సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి (BJP) గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాబు మోహన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections 2024) నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ (Warangal) నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభించి కచ్చితంగా విజయం సాధిస్తామని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

Kodali Nani: పవన్‌పై ప్రేమ కురిపిస్తూ.. జనసైనికులకు జాగ్రత్తలు చెప్పిన కొడాలి నాని

బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ రాజీనామా...

కాగా.. గత నెలలో బీజేపీకి బాబుమోహన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కూడా. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందని ఆరోపణలు చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు. అయితే వరంగల్ ఎంపీ టికెట్‌ను మాజీ మంత్రి ఆశించారు. కానీ.. వరంగల్ టికెట్ బాబుమోహన్‌కు ఇచ్చేందుకు కమలంపార్టీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి బాబు మోహన్ గుడ్‌బై చెప్పేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. దీంతో బీజేపీ చివరి నిమిషంలో ఆందోల్ టికెట్‌కు బాబూమోహన్‌కు ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

ఇవి కూడా చదండి...

Kavitha: ఆ జీవోతో ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టారు... కాంగ్రెస్‌ సర్కార్‌పై కవిత ఫైర్


AP Highcourt: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్‌కు షాక్...


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 04 , 2024 | 04:11 PM