Share News

Vote for Note: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ABN , Publish Date - May 03 , 2024 | 11:24 AM

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Vote for Note: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకి నోటు కేసు విచారణ మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు.

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్


న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌‌లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు గుంతకండ్ల జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహ్మద్‌ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది.

ఇవి కూడా చదవండి...

Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2024 | 11:27 AM