Share News

Union Minister: ఒక మహిళ చేతిలో ఒవైసీ ఓటమి ఖాయం..

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:45 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి చేతిలో మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) ఓటమి ఖాయమని, మత రాజకీయాలు మినహా ఆయన సాధించిందేమీ లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ విమర్శించారు.

Union Minister: ఒక మహిళ చేతిలో ఒవైసీ ఓటమి ఖాయం..

- కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి చేతిలో మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) ఓటమి ఖాయమని, మత రాజకీయాలు మినహా ఆయన సాధించిందేమీ లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత కొంపెల్ల నామినేషన్‌ సందర్భంగా బుధవారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ చివరి వరకు ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతోనే ఆ పార్టీ, ఎంఐఎం(MIM) దోస్తీ అర్థం అవుతోందన్నారు.

ఇదికూడా చదవండి: KCR : 12 సీట్లిస్తే.. సర్కారు మెడలు వంచుతా

మహిళల అభ్యున్నతిని అడ్డుకొనే ఒవైసీకి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మాధవీలత వచ్చినప్పటి నుంచీ ఒవైసీ కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఆమె మంచి జీవితాన్ని వదులుకొని సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. హైదరాబాదు పార్లమెంటులో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బ్యాండ్‌ బాజాలతో..

చార్మినార్‌ : బ్యాండ్‌బాజాలు, మహిళల బోనాలతో కలిసి చార్మినార్‌ నుంచి మాధవీలత ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఇదికూడా చదవండి: Khammam: నామ నాగేశ్వరరావు ఆస్తులు రూ.155 కోట్లు

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 09:45 AM