Share News

Telangana: కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:59 PM

తెలుగు వారి ముఖ్య పండుగ అయిన సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం

Telangana: కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

తెలుగు వారి ముఖ్య పండుగ అయిన సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకే కాకుండా కాలేజీలకూ సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు తెరుచుకుంటాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, కేజీబీవీలు, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలతో సహా అన్ని రకాల కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది.

సంక్రాంతి సెలవుల్లో స్పెషల్ క్లాసెస్ నిర్వహించకూడదని, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా జనవరి 12 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవుల అనంతరం ఫార్మేటివ్ అసెస్‌మెంట్-4 జరగనుంది.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 02:01 PM