Share News

IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. రూ.150కే రూమ్ ఫెసిలిటీ.. పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:15 PM

ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఉపాధి కోసం సుదూరాలకు వచ్చి ఉంటున్న వారు తమ స్వస్థలాలకు

IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. రూ.150కే రూమ్ ఫెసిలిటీ.. పూర్తి వివరాలివే..

ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఉపాధి కోసం సుదూరాలకు వచ్చి ఉంటున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. పండుగలు, సెలవుల్లో ప్రయాణికుల రద్దీతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ఆ రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తుంటారు. తాజాగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భారతీయ రైల్వే బంపరాఫర్ ప్రకటించింది. రైళ్లు ఆలస్యమయినప్పుడు, లింక్ రైళ్ల కోసం వెయిట్ చేసే సమయంలో ప్యాసింజర్లకు ఇబ్బందులు కలగకుండా రిటైరింగ్ రూమ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవంల రూ.150 కే వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చి హోటల్ రూమ్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా రైల్వే స్టేషన్ లోనే సకల సౌకర్యాలతో ఈ రూమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

రిటైరింగ్ గదుల ధరలు చాలా తక్కువ. AC, నాన్ AC రూమ్ లు ఉన్నాయి. ఈ గదులు వేర్వేరు స్టేషన్లలో వేర్వేరు ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నాన్-ఏసీ గది ధర 12 గంటలకు రూ.150 కాగా, ఏసీ రూం ధర 24 గంటలకు రూ.450 గా ఉన్నట్లు తెలిపింది. ఈ గదులను ఒక గంట నుంచి 48 గంటల కోసం బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్టేషన్లలో గంట ప్రాతిపదికన కూడా బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.


గదిని బుక్ చేయడానికి ఐఆర్సీటీసీ సైట్ లేదా యాప్‌కు లాగిన్ చేసి, నా బుకింగ్ ఎంపికపై క్లిక్ చేయాలి. అక్కడ రిటైరింగ్ రూమ్ ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ పేమెంట్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత, పీఎన్ఆర్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే రూమ్ బుక్ అవుతుంది.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 01:15 PM