Share News

TG Politics: ఆ అంశంపై మరోసారి మాట్లాడితే మోదీపై కేసు వేస్తా: షబ్బీర్ అలీ

ABN , Publish Date - May 24 , 2024 | 09:10 PM

పదేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు.మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తానని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

TG Politics: ఆ అంశంపై మరోసారి మాట్లాడితే మోదీపై కేసు వేస్తా: షబ్బీర్ అలీ
Shabbir Ali

హైదరాబాద్: పదేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు.మతపరమైన రిజర్వేషన్లను తీసేస్తానని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలా మాట్లాడుతారని నిలదీశారు.


శుక్రవారం గాంధీభవన్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... ముస్లింల్లో అందరికీ రిజర్వేషన్లు లేవని.. కేవలం వెనుకబడిన తరగతుల వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని స్పష్టం చేశారు. హిందూ , ముస్లింల మధ్య రిజర్వేషన్ల పేరుతో బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. ముస్లింల రిజర్వేషన్ల మీద మళ్లీ ఇంకో సారి మోదీ మాట్లాడితే డిఫర్మేషన్ కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ముస్లింలను ఆదుకుంటున్నామని, వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2024 | 09:53 PM