Share News

Graduate MLC Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ABN , Publish Date - May 20 , 2024 | 09:33 PM

తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.

Graduate MLC  Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar

ఖమ్మం జిల్లా: తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని అన్నారు.

రాకేష్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఉద్యోగాలపై ప్రశ్నిస్తారని చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికలను రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న యుద్ధంలా చూడొద్దన్నారు. బాగా చదువుకున్న విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు గ్యారెంటీలకు విలువపోయిందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన 6 గ్యారంటీలతో.. అన్ని గ్యారెంటీలకు విలువపోయిందని ఎద్దేవా చేశారు.


మారుమూల ప్రాంతంలో పుట్టిన జ్యోతి అనే అమ్మాయిని గోవాలో జరిగే ఆటల పోటీలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంపిస్తే ఆ అమ్మాయి సిల్వర్ మెడల్ గెలుచుకుందని గుర్తుచేశారు. అమ్మాయిల కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 వేల కోట్లతో 55 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కాలేజ్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కారు గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


కేసీఆర్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది అమ్మాయిల భవిష్యత్తు మారిందని తెలిపారు. స్పందించే హృదయం ఉన్న అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఎలాంటి స్పందించే గుణం లేని అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని చెప్పారు. రాకేష్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టి పది, ఇంటర్‌‌లో ర్యాంకులు సాధించి ఐఐటీ చదువుకున్నారని చెప్పారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు ఉన్నాయి, చట్టసభల్లో కూర్చునే వ్యక్తిపై కేసులు ఉండాలా అని ప్రశ్నించారు. ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మహిళల ఫొటోలు మార్ఫింగ్ విషయంలో కూడా తీన్మార్ మల్లన్న పై కేసులు ఉన్నాయన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజే వ్యక్తులను మనం కోరుకుంటామా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 09:45 PM