Share News

TS News: స్కానింగ్‌కు వెళ్తూ బాబును చూడమని పక్కన మహిళకు ఇవ్వగా.. తిరిగి వచ్చేసరికి షాక్..

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:13 AM

Telangana: నాలుగేళ్ల బాబు కిడ్నాప్‌ను రెండు గంటల్లోనే చేధించిన శభాష్ అనిపించుకున్నారు సూరారం పోలీసులు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (గురువారం) నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇషాన్ రెడ్డి (4) అనే బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు తమ కుమారుడు ఇషాన్ రెడ్డితో కలిసి నిన్న (గురువారం) మల్లారెడ్డి హాస్పటల్‌కు మెడికల్ చెకప్‌ కోసం వచ్చారు.

TS News: స్కానింగ్‌కు వెళ్తూ బాబును చూడమని పక్కన మహిళకు ఇవ్వగా.. తిరిగి వచ్చేసరికి షాక్..

మేడ్చల్ జిల్లా, మార్చి 22: నాలుగేళ్ల బాబు కిడ్నాప్‌ను రెండు గంటల్లోనే చేధించిన శభాష్ అనిపించుకున్నారు సూరారం పోలీసులు (Telangana police). సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (గురువారం) నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇషాన్ రెడ్డి (4) అనే బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు తమ కుమారుడు ఇషాన్ రెడ్డితో కలిసి నిన్న (గురువారం) మల్లారెడ్డి హాస్పటల్‌కు మెడికల్ చెకప్‌ కోసం వచ్చారు. అయితే స్కానింగ్ కోసం వెళ్తూ పక్కనే ఉన్న మహిళ సాయం అడగటమే పొరపాటైంది. తమ బాబును చూసుకోమని పక్కనే తన పిల్లలతో ఉన్న మహిళ కోరుతూ.. బాబుతో పాటు ఫోన్‌ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి లోపలికి వెళ్లాడు. అయితే తిరిగి వచ్చే సరికి బాబు కనిపించకపోడంతో రాజశేఖర్‌రెడ్డి దంపతులు షాక్‌కు గురయ్యారు.

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..


బాబుతో పాటు పిల్లలతో ఉన్న మహిళ అదృశ్యమైంది. దీంతో రాజశేఖరెడ్డి దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తైన పోలీసులు కేసు నమోదు చేసి బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాబును షాపూర్ నగర్‌లో వదలి ఫోన్‌తో మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. రెండు గంటల వ్యవధిలో బాబును పోలీసులు రక్షించి.. తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. అదృశ్యమైన మహిళ ఆచూకి కోసం సూరారం పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు. అయితే రెండు గంటలలోనే చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసులకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

BJP: కమలం కసరత్తు.. నేడు అభ్యర్థులపై క్లారిటీ.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న నామా?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 11:24 AM