Share News

Lok Sabha Elections: 5,59,905 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్‌ ఘనవిజయం

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:29 AM

లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 5,59,905 ఓట్ల ఆధిక్యంతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. అంతేకాదు.. అరంగేట్రంతోనే ఆయన దక్షిణాదిలో అత్యధిక మెజారిటీ సాధించడం విశేషం.

Lok Sabha Elections: 5,59,905 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్‌ ఘనవిజయం

  • రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ.. ‘హుజూర్‌నగర్‌’ నుంచే 1.05 లక్షలు

నల్లగొండ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 5,59,905 ఓట్ల ఆధిక్యంతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. అంతేకాదు.. అరంగేట్రంతోనే ఆయన దక్షిణాదిలో అత్యధిక మెజారిటీ సాధించడం విశేషం. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17,26,204 ఓటర్లుండగా.. 12,90,238 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రఘువీర్‌కు 7,84,337(60.5ు) రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2,24,432 ఓట్లు వచ్చాయి. కాగా.. తెలంగాణలో ఇప్పటివరకు 2014 ఎన్నికల్లో మెదక్‌ నుంచి గెలుపొందిన మాజీ సీఎం కేసీఆర్‌ సాధించిన 3,97,029 ఓట్ల మెజారిటీనే అత్యధికం.. ఇప్పుడు అది తుడిచిపెట్టుకుపోయింది.


ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(5.8లక్షలు) పేరిట ఉంది. కాగా.. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలో అత్యధికంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే రఘువీర్‌కు 1,05,419 మెజారిటీ వచ్చింది. పద్మావతి ఉత్తమ్‌ స్థానమైన కోదాడ నియోజకవర్గంలో 95,737 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం..! రఘువీర్‌ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి జిల్లా మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత ప్రచారం చేశారు.

Updated Date - Jun 05 , 2024 | 05:29 AM