Share News

BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:59 PM

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ ( Telangana ) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు.

BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ ( Telangana ) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆర్ఎస్ ను వీడి వెళ్లిపోతున్నారని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసినోళ్లు సేవ చేస్తామని వస్తున్నారు.. మెదక్ ప్రజలారా ఆలోచించాలని సూచించారు. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. రఘునందన్ ఎవరి జోలికి వెళ్లడని తన జోలికి వస్తే మాత్రం ఉరుకునేది లేదని స్పష్టం చేశారు.

Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం

"బీఆర్ఎస్ మోసాలను ఎండగడుతం. 17 స్థానాలు గెలిచి ప్రధాని మోదీకి మోదీకి కానుకగా ఇస్తాం. ఫోన్ ట్యాపింగ్‌లో మొదట జైలుకు వెళ్లాల్సింది హరిశ్ రావే. దుబ్బాక ఉప ఎన్నికల్లో నన్ను, నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. తొందరగా టైటానిక్ షిప్ లో నుంచి కేసీఆర్ కుటుంబం బయటకు రావాలి. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆస్తులు ఎంత. రూ.17 కోట్లు అని ఎమ్మెల్సీ అఫిడవిట్ లో చూపించారు. వెంకట్రామిరెడ్డి కి రాజపుష్ప కంపెనీ తో సంబంధం ఉందో లేదో చెప్పాలి."

- రఘునందన్ రావు


గల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దిల్లీలో మాత్రం మోదీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘునందన్ రావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా కాని పనులు తనను ఎంపీ గా గెలిపిస్తే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. మెదక్ ఎన్నిక ఏకపక్షం కానుందన్న రఘునందన్ రావు ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 03:02 PM