Share News

Raghunandan Rao: సూటికేసులు మోసేటోళ్లకు బీఆర్ఎస్‌లో పదవులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:40 PM

మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు జిన్నారం మండలం కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి, పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేడు మెదక్ ఎంపీ అభ్యర్థి కరువయ్యారని చెప్పారు.

Raghunandan Rao: సూటికేసులు మోసేటోళ్లకు బీఆర్ఎస్‌లో పదవులు

సంగారెడ్డి జిల్లా: మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు జిన్నారం మండలం కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి, పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేడు మెదక్ ఎంపీ అభ్యర్థి కరువయ్యారని చెప్పారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌లో అక్రమంగా కోట్లు సంపాదించిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి నేడు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.

పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా సూటికేసులు మోసేటోళ్లకు బీఆర్ఎస్‌లో పదవులు ఇచ్చారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పోల్‌కు కట్టేసి కొడుతమంటున్నారని చెప్పారు. దేశ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులని ప్రధాని మోదీ అంటే... మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కవిత, కేటీఆర్, హరీష్, సంతోష్, వాళ్ల కుమారులే తన కుటుంబ సభ్యులని చెబుతారని అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడైనా మెదక్ జిల్లాకు వచ్చారా అని ప్రశ్నించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడో సారి కూడా ప్రధాని మోదీనేనని ప్రజలు చెబుతున్నారని రఘునందన్ రావు అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 09:40 PM