Share News

KCR: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:12 PM

బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌పై చేతబడి జరిగిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. కేసీఆర్ ఉంటున్న నందినగర్ నివాసం పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి.

KCR: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
Perform Of Black Magic Rituals Near KCR Home At Hyderabad

హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌పై (KCR) చేతబడి జరిగిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. కేసీఆర్ (KCR) ఉంటున్న నందినగర్ నివాసం పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడ నిజంగా క్షుద్ర పూజలు చేశారా..? లేదంటే ఆకతాయిల పని అనే సందేహాలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది.

TG Politics: రేవంత్ మరో గజిని.... బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విసుర్లు


క్షుద్రపూజలు చేసిన ప్రాంతం కేసీఆర్ నివాసానికి సమీపంలో ఉంది. అక్కడ నిమ్మ కాయలు, బొమ్మ, మిరపకాయ, పాలిథిన్ కవర్‌లో నల్ల కోడి ఈక, కోడి గుడ్డు, కుంకుమ, చీర, పసుపుతో ముగ్గు వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అవి చూసి స్థానికులు కేసీఆర్ ఇంటి వద్ద గల సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దాంతో క్షుద్ర పూజల గురించి తెలిసింది. క్షుద్రపూజల గురించి తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు.

TS Politics: ‘ఒవైసీ బ్రదర్స్‌ను చంపేందుకు బుల్లెటో.. జైలో అవసరం లేదు’.. రాజాసింగ్ సంచలన కామెంట్స్


నందినగర్ నివాసంలో ప్రస్తుతం కేసీఆర్ ఉండటం లేదని తెలిసింది. కేటీఆర్ కుటుంబంతో ఉంటున్నారు. బిజీగా ఉండే ఆ ప్రాంతంలో క్షుద్రపూజలు చేయడం తీవ్ర కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీ బట్టి క్షుద్రపూజలు చేసిందెవరో తేలనుంది. నిజంగా చేతబడి చేశారా..? లేదంటే ఆకతాయిల పని అనే అంశంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్... కేటీఆర్ విసుర్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 16 , 2024 | 07:33 PM