Share News

Raghunandan Rao: కాంగ్రెస్ నేతలు ఆ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:48 PM

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ10, బీఆర్ఎస్ 7 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఆదివారం నాడు గజ్వేల్‌లో కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా సర్కిల్‌లో సభ జరిగింది.

Raghunandan Rao: కాంగ్రెస్ నేతలు ఆ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

సిద్దిపేట: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ10, బీఆర్ఎస్ 7 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఆదివారం నాడు గజ్వేల్‌లో కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా సర్కిల్‌లో సభ జరిగింది. కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్, రఘునందన్ రావు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు.

బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ నిరంకుశత్వం, అహంకారం మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి పొత్తుల పేరిట డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నట్లు చెప్పిందన్నారు. అప్‌తో కలిసి బీఆర్ఎస్ లిక్కర్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబితేనే యశోద హాస్పిటల్స్‌కు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై పోరాడుతాం: హరీశ్ బాబు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయి ప్రజల సమస్యలను పట్టించులేదని బీజేపీ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు చెప్పారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలం ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పారు.. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామని అన్నారు. కాంగ్రెస్ అలవీ కానీ హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు. 500 ఏళ్ల తర్వాత సరయు నది తీరంలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరం సాకారమైందని తెలిపారు. మోదీ నాయకత్వం దేశానికే కాదు ప్రపంచానికి అవసరమని అన్నారు. భారత్‌ను విశ్వగురువుగా నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని హరీశ్ బాబు చెప్పారు.

Updated Date - Feb 25 , 2024 | 10:48 PM