Share News

BRS vs Congress: కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:55 PM

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌కు(KCR) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో(Congress) చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది.

BRS vs Congress: కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!
KCR Friend Madan Reddy

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌కు(KCR) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో(Congress) చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే(Medak).. అదికూడా స్నేహితుడే ఆయనకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారట. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ స్నేహితుడు మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. కొన్నాళ్లుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మదన్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లిన మదన్ రెడ్డి.. త్వరలోనే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్‌ను మదన్ రెడ్డికి బదులుగా మదన్ రెడ్డికి కేటాయించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఎమ్మెల్యేలు సైతం..

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు నేతలు సైతం ఈ వరుసలో ఉన్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు ఎమ్మెల్యేలు సైతం గోడ దూకే ప్రయత్నం చేస్తున్నారు. ఇకంగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి తమ చేరబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారనేది ముందు ముందు తెలియనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 12:55 PM