Share News

TS NEWS: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు

ABN , Publish Date - Jan 13 , 2024 | 04:03 PM

తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్‌నీ శనివారం నాడు ప్రారంభించారు.

TS NEWS: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా: తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్‌నీ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... పతంగుల పండగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. పతంగులకి దారం ఆధారం అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని చెప్పారు. సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా పతంగుల పండగ జరుగుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 04:03 PM