Share News

KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు..

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:16 AM

కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అన్నారు. తాను ప్రారంభించిన ఆయారాం - గయారాం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు.

KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు..

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అన్నారు. తాను ప్రారంభించిన ఆయారాం - గయారాం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటుందన్నారు. తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ సభ.. ఏర్పాట్లు ఏ రేంజ్‌లో చేశారో తెలిస్తే..


ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే... తెలంగాణలో కారు గుర్తు పై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశం పైన మాట్లాడాలన్నారు. లేకుంటే ఆయన ఒక హిపోక్రట్‌గా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించాలన్నారు. తద్వారా తాము చెప్పిందే చేస్తామని... అబద్ధాలు చెప్పమనే విషయాన్ని నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.

వాహనాలు నిలువ నీడ లేకపాయే!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 10:16 AM