Share News

Potu Ranga Rao: బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిజం సిద్ధాంతాలపై పోరాటం

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:22 PM

బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యతగా సీపీఐ(ఎంఎల్) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు(Potu Ranga Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Potu Ranga Rao: బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిజం సిద్ధాంతాలపై పోరాటం

ఖమ్మం జిల్లా: బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యతగా సీపీఐ(ఎంఎల్) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు(Potu Ranga Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చ్ 3, 4, 5 తేదీల్లో మహాసభలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మహాసభలకు, బహిరంగ సభలకు సుమారు 30 వేలమందితో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సభకు డీవీ కృష్ణయ్య పేరుతో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభలో రాజకీయ తీర్మానాలు పెట్టి ఆమోదిస్తామని చెప్పారు. ఈ సభలో జాతీయ నాయకులను ఎన్నుకుంటామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాముడిని, మతాన్ని వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగా మైనార్టీలపై, కమ్యూనిస్ట్ నాయకులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

అందువల్లే బీఆర్ఎస్ ఓటమి...

బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశమైన పాలన అందిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం కూడా గడీల పాలనలో ఏకచక్రా ధిపత్యంగా వ్యవహరిస్తే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి స్వస్తి పలికారని అన్నారు. బీఆర్ఎస్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని చెప్పారు. మూడు పార్టీలు ఓకే పార్టీగా ఏర్పడేందుకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్‌గా పేరు పెట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన అమలు చేయాలని కోరారు. పోడు భూములు, రైతు బంధు వంటి పథకాలపై కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోటు రంగారావు కోరారు.

మార్చి 3, 4, 5వ తేదీల్లో ఐక్యతా సభలు: ప్రదీప్ సింగ్ ఠాగూర్

ఖమ్మంలో ఆల్ ఇండియా యూనిటీ సభలు జరగనున్నాయని ఐక్యతా సదస్సు నాయకులు ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సభల్లో దేశ, విదేశాల నుంచి నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ రోజుల్లో దేశంలో ఎంతోమంది జర్నలిస్ట్‌లు జైళ్లలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఇండియాని హిందూ దేశంగా చేయాలని చూస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని కొన్ని వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కోసం రైతులు ఢిల్లీ, హర్యానాలో రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని వివరించారు. మార్చి 3, 4, 5 వ తేదీల్లో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో ఐక్యతా సభలు జరగనున్నాయని ప్రకటించారు. ఈ సభల్లో 16 రాష్ట్రాల నుంచి 300 మంది నాయకులు పాల్గొంటారని ప్రదీప్ సింగ్ ఠాగూర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

Bhatti Vikramarka: చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 06:22 PM