Share News

TS News: బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 15 , 2024 | 02:33 PM

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.

TS News: బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagende) కూడా ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు దానం భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 02:41 PM