Share News

TS Politics: ఎమ్మెల్యే సంజయ్‌కు బిగ్ షాక్.. చేజారిన జగిత్యాల..!

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:37 PM

Telangana: జగిత్యాల మున్సిపల్ చైర్మన్(Jagtial Municipality) ఎన్నికలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు(MLA Sanjay Kumar) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కౌన్సిలర్లు. సంజయ్ ఆదేశాలను ధిక్కరించి మరీ వేరే వాళ్లకు జైకొట్టారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణికి కాకుండా.. జ్యోతికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు. కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress) సైతం జ్యోతికే సపోర్ట్ చేశారు.

TS Politics: ఎమ్మెల్యే సంజయ్‌కు బిగ్ షాక్.. చేజారిన జగిత్యాల..!
BRS Loss Jagtial Municipal Chairman

Telangana: జగిత్యాల మున్సిపల్ చైర్మన్(Jagtial Municipality) ఎన్నికలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు(MLA Sanjay Kumar) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కౌన్సిలర్లు. సంజయ్ ఆదేశాలను ధిక్కరించి మరీ వేరే వాళ్లకు జైకొట్టారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణికి కాకుండా.. జ్యోతికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు. కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress) సైతం జ్యోతికే సపోర్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణి ఓటమి పాలయ్యారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. సంఖ్యా బలం ఉండి కూడా చైర్మన్‌ను పదవికి కోల్పోయింది బీఆర్ఎస్. దీంతో జగిత్యాల కొత్త మున్సిపల్ చైర్మన్‌గా అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. వాణికి 23 ఓట్లు పడగా.. జ్యోతికి 24 మంది కౌన్సిలర్లు మద్ధతు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల సపోర్ట్‌తో జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌గా జ్యోతి ఎన్నికయ్యారు.

జగిత్యాల మున్సిపల్‌లో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బుధవారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 35 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం కౌన్సిలర్ హాజరయ్యారు. అయితే ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో గైర్హాజరుగా ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2024 | 12:37 PM