Share News

TG Politics: కాంగ్రెస్ నేతలకు మరోసారి జగ్గారెడ్డి వార్నింగ్

ABN , Publish Date - Apr 05 , 2024 | 08:39 PM

సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో కొండాపూర్ మండలం మల్కాపుర్‌లోని వెంకటేశ్వర గార్డెన్‌లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.

TG Politics: కాంగ్రెస్ నేతలకు మరోసారి జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో కొండాపూర్ మండలం మల్కాపుర్‌లోని వెంకటేశ్వర గార్డెన్‌లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.


Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చేయించుకోవాలని చెప్పారు. నిధులు తెచ్చేది తానైనా ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేకే ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఏ పార్టీ వారైన ప్రోటోకాల్ పాటించాల్సిందేనని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తే అడ్డుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నాయకులపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కార్యకర్తల పౌరుషం ఏమైందని.. ఎందుకు తనను గెలిపించలేక పోయారని ప్రశ్నించారు.


Prudhvi Raj: నేను డ్యాన్స్ చేస్తే ఆ మంత్రి తట్టుకోలేకపోయారు

ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచిన ఏ పార్టీ వారైన గౌరవం ఇవ్వాల్సిందేనని సూచించారు. తాను ఇప్పుటినుంచి ఓట్ల కోసం రాజకీయాలు చేయనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకి సంగారెడ్డి నియోజకవర్గంలో 20 వేల మెజార్టీ రావాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను ఎన్నికల్లో తిరగాలి, రావాలని అనుకోవద్దని అన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఇకపై నిర్మలనేనని ప్రకటించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి తీర్మానం చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.


ఇవి కూడా చదవండి

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 08:50 PM