Hyderabad: ఇంటి ముందు మూత్రం పోశాడని దాడి.. చివరికి యువకుల పరిస్థితి..
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:25 PM
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి నాగిరెడ్డి కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అజయ్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అజయ్ ఓ ఇంటి ముందు మూత్రం పోశాడు.
హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. తప్పతాగిన అజయ్ అనే వ్యక్తి ఓ ఇంటి ముందు మూత్రం పోయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అతను చేసిన పనికి కాలనీవాసులంతా మూకుమ్మడిగా దాడి చేశారు. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 23న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి నాగిరెడ్డి కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అజయ్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అజయ్ ఓ ఇంటి ముందు మూత్రం పోశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతని చేష్టలను తీవ్రంగా ఖండించారు. తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపోద్రిక్తులైన కాలనీ వాసులు వారిద్దరిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా పెద్దపెద్ద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అజయ్ చొక్కా చింపేసి మరీ తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తీవ్రగాయాలతో కిందపడిపోయినా వదలకుండా ఇష్టానుసారంగా కొట్టారు. దీంతో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో మోహన్ రెడ్డికి సైతం తీవ్రగాయాలు అయ్యాయి.
మెుత్తం ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే తల, ఇతర శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతినడంతో అజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరో బాధితుడు మోహన్ రెడ్డి సైతం చికిత్సపొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. పలువురు కాలనీ వాసులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు
Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..
Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..