Share News

TSPSC Group 1: పాత వారు మళ్లీ గ్రూప్ 1 కి అప్లై చేసుకోవాలా? కీలక వివరాలు మీకోసం..

ABN , Publish Date - Feb 19 , 2024 | 09:08 PM

TSPSC Group 1 Notification 2024: ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్‌(Group 1 Exam) రద్దవగా.. ఇప్పుడు ఆ నోటిఫికేషనే రద్దైంది. అంతేకాదు.. ఆ పాత నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ కొన్ని పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) సరికొత్త నోటిఫికేషన్(Group 1 Notification) జారీ చేసింది.

TSPSC Group 1: పాత వారు మళ్లీ గ్రూప్ 1 కి అప్లై చేసుకోవాలా? కీలక వివరాలు మీకోసం..
TSPSC Group 1 Notification 2024

TSPSC Group 1 Notification 2024: ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్‌(Group 1 Exam) రద్దవగా.. ఇప్పుడు ఆ నోటిఫికేషనే రద్దైంది. అంతేకాదు.. ఆ పాత నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ కొన్ని పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) సరికొత్త నోటిఫికేషన్(Group 1 Notification) జారీ చేసింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమై.. మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు(Online Application) చేసుకోవచ్చు. అయితే, కొత్త నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సందేహాలన్నింటికీ సమాధానం ఇక్కడ తెలుసుకోండి..

జరిగిందిదీ..

2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్ష రద్దైంది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసింది.

పాత వారు మళ్లీ అప్లై చేసుకోవాలా?

గత నోటిఫికేషన్‌లో అప్లై చేసుకున్న వారు కూడా తాజా నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ స్పష్టం చేసింది. అయితే, గతంలో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, నేరుగా అప్లై చేసుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే.. కొత్త అప్లై చేసుకునే వారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు, ఎగ్జామ్స్ డేట్స్..

563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక మార్చి 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మే లేదా జూన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు.

వయోపరిమితి పెంపు..

గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో 46 సంవత్సరాలు ఉన్న నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఇక సామాజిక వర్గాల ప్రకారం కూడా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గ్రూప్ 1 పోస్టుల కోసం అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతామని అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్నిఉద్యోగాలు/ఎడ్యూకేషన్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 09:08 PM