Share News

TS News: బాలిక వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చేలోగా షాకింగ్ ఘటన.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:16 AM

Telangana: జిల్లాలో దొంగల ఆగడాలకు అంతేలేకుండా పోతంది. వేసవి కాలం నేపథ్యంలో ఉక్కపోతగా ఉండటంతో ప్రజలు ఆరు బయట నిద్రించేందుకు ఇష్టపడుతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతులకు పనులు చెబుతుంటారు. అర్ధరాత్రులు దర్జాగా ఇంట్లోకి చొరబడి దొరికకాడికి దోచుకుంటుంటారు. అయితే రాజేంద్రనగర్‌లో మాత్రం దొంగలు చేసిన పని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పట్ట పగలు అని చూడకుండా.. ఎలాంటి అదురు బెదరు లేకుండా దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు.

TS News: బాలిక వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చేలోగా షాకింగ్ ఘటన.. భయాందోళనలో ప్రజలు

రంగారెడ్డి, ఏప్రిల్ 11: జిల్లాలో దొంగల ఆగడాలకు అంతేలేకుండా పోతంది. వేసవి కాలం నేపథ్యంలో ఉక్కపోతగా ఉండటంతో ప్రజలు ఆరు బయట నిద్రించేందుకు ఇష్టపడుతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతులకు పనులు చెబుతుంటారు. అర్ధరాత్రులు దర్జాగా ఇంట్లోకి చొరబడి దొరికకాడికి దోచుకుంటుంటారు. అయితే రాజేంద్రనగర్‌లో (Rajendra nagar) మాత్రం దొంగలు చేసిన పని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పట్ట పగలు అని చూడకుండా.. ఎలాంటి అదురు బెదరు లేకుండా దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు.

Hyderabad: భలే చెప్పారు బ్రహ్మానందం!


అసలేం జరిగిందంటే..

రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడిని దుండగులు అందిన కాడికి దోచేశారు. ముఖానికి మాస్క్ ధరించి మరీ దర్జాగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించారు. ఆ సమయంలో ఇంట్లో బాలిక మాత్రమే ఉంది. ఆ బాలిక వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి దుండగులు అంతా దోచేసి బయటకు పరుగులు తీశారు. అయితే బాలిక ధైర్యం చేసి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమెను తోసేసి దొంగలు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులను గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దోపిడీకి గురైన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్ట పగలే ఎలాంటి భయం లేకుండా దుండగులు దర్జాగా దోపిడీకి పాల్పడటంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: పాల‌కొండ‌ను పాలించేదెవ‌రు..?

BJP: రాసిపెట్టుకోండి... తమిళనాట బీజేపీ హవా ఖాయం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 11:50 AM