Share News

Telangana: ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ ప్రెస్ మీట్.. కేబినెట్ సమావేశానికి ముందే..

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:18 AM

తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి

Telangana: ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ ప్రెస్ మీట్.. కేబినెట్ సమావేశానికి ముందే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కేబినెట్ సమావేశానికి ముందే కృష్ణా జలాల వివాదంపై పూర్తి వివరాలను మీడియాకు వివరించనున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఒప్పందాల పూర్తి వివరాలతో మీడియా ముందుకు రానున్నారు. అనంతరం తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులతో అంబేడ్కర్ సచివాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న మీడియా ఛాంబర్ లో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రధానంగా ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. రూ. 500కే గ్యాస్ సిలీండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ను అమలు చేసేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం 12 నుంచి ఐదు రోజులు పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 11:45 AM