Share News

TS Politics: ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:28 PM

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ(Shabbir Ali) jకీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు.

TS Politics: ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

కామారెడ్డి జిల్లా: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ(Shabbir Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని పడగొడదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మైనార్టీలకు ఏటా పెంచాల్సిన బడ్జెట్‌లో కేవలం చాలా తక్కువ వాటా కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు. మైనార్టీలకు చిన్న చూపు చూసి స్కాలర్ షిప్ తగ్గించారని మండిపడ్డారు. మోదీ ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్’ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనని షబ్బీర్ అలీ అన్నారు.

పార్టీలో చేరికల విషయమై తమ హైకమాండ్ ఇప్పుడు వద్దని చెబుతోందన్నారు. పార్టీ పిరాయింపులు వద్దనడం వల్ల ఆగామని.. లేకపోతే పలు పార్టీల్లోని నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. రెండు నెలలు కాకముందే తమపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని షబ్బీర్ అలీ అన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 08:32 PM