Share News

Revanth Reddy: హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా మారుస్తాం..

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:12 PM

తెలంగాణలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చామన్నారు.

Revanth Reddy: హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా మారుస్తాం..

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పేర్కొన్నారు. హెచ్ఐసీసీ (HICC)లో బయో ఆసియా (Bio Aisa)-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ (Pharma Villages) ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చామన్నారు. జినోమ్ వ్యాలీ ఫేజ్-2ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మీ కలలను సాకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా మారుస్తామన్నారు. ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రపంచ వేదికగా ఉందని.. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ తెలిపారు. ఫార్మా విలేజ్‌లకు రూపకల్పన చేశామన్నారు. కరోనా ఎన్నో ఇబ్బందులను సృష్టించిందన్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉత్పత్తి అయిన కరోనా టీకాలు ప్రపంచ వ్యాప్తంగా సరాఫరా అయ్యాయన్నారు. ఫార్మా రంగానికి చెందిన ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యానన్నారు. ఎలాంటి సమయంలోనైనా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్న ఫార్మా రంగ ప్రతినిధులకు రేవంత్ అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 12:12 PM