Share News

Hyderabad: 220 హత్యలు.. 60వేల మంది నిరాశ్రయులు

ABN , Publish Date - May 05 , 2024 | 10:36 AM

గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.

Hyderabad: 220 హత్యలు.. 60వేల మంది నిరాశ్రయులు

  • 366 రోజులుగా మణీపూర్ తగులబడుతోంది

  • హింసను కేంద్ర ప్రభుత్వం వెంటనే అరికట్టాలి

  • హైదరాబాద్లో కూకీ-జో తెగల భారీ సమావేశం

హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.

366 రోజుల తర్వాత కూడా అక్కడ హింస ముగియలేదని, తమ తెగలకు చెందిన బాధితులకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


హైదరాబాద్ ఉనావ్ ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఇక్కడ ఉంటున్న మణీపూర్కు చెందిన కూకీ-జో తెగలకు చెం దిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయుధ మైటీ తెగలు, కూకీ-జో తెగల మధ్య గత ఏడాది కాలంగా సాగిన హింసలో మొత్తం 220 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 176 మంది కూకీ- తెగల వారే ఉన్నారని ప్రతినిధులు పేర్కొన్నారు.

60వేల మంది నిరాశ్రయులయ్యారని, 200 గ్రామాల్లోని 7వేల గృహాలు, 360 చర్చిలు ధ్వంసం చేశారని వివరిం చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కూడా మణీపూర్ లో సాధారణ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అక్కడి మైటీ, కూకీ తెగల ప్రజలకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించి, ప్రత్యేక పరిపాలన అమలు చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 10:36 AM