Share News

R. Krishnaiah: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఈనెల 29, 30వ తేదీలల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాం

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:04 PM

బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో 14 బీసీ సంఘాల నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30వ తేదీలలో చలో ఢిల్లీ , పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు.

R. Krishnaiah: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఈనెల 29, 30వ తేదీలల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాం

హైదరాబాద్ : బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో 14 బీసీ సంఘాల నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30వ తేదీలలో చలో ఢిల్లీ , పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు జరిపామని, 66 సార్లు ప్రధాన మంత్రులను కలిసి చర్చలు జరిపినట్లు గుర్తు చేశారు. వందలాది పార్లమెంటు సభ్యులను, ప్రతిపక్ష పార్టీలను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 18 డిమాండ్లు పెట్టగా... 2 డిమాండ్లు జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా, కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి అంగీకరించారని జీవోలు జారీ చేశారన్నారు.

ఇంకా అంగీకరించిన నాలుగు డిమాండ్లలో రెండు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర బడ్జెటు బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ డిమాండ్లు పరిష్కారం కాలేదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభ ప్రకారం 27శాతం నుంచి 56 శాతంకు పెంచాలని డిమాండ్ చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 11:04 PM