Share News

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:47 AM

Telangana: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్‌భవన్‌ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్, మార్చి 5: తెలంగాణ (Telangana) పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని (Ujjain Mahankali Temple) దర్శించుకున్నారు. రాజ్‌భవన్‌ (Rajbhavan) నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రధాని (PM Modi) ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో సంగారెడ్డికి వెళ్లనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఆపై తెలంగాణ పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఒరిస్సాకు బయలుదేరి వెళ్లనున్నారు.

modi-secundrabad.jpg

ఇవి కూడా చదవండి...

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

PM Modi: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 11:55 AM