Share News

MLA Malla Reddy: ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు: మల్లారెడ్డి

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:12 PM

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్ళలు గుప్పించారు. బుధవారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తామే గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వాళ్ళు చేసిందేమీ లేదని, ఓటు అడిగే హక్కు ఆ రెండు పార్టలకు లేదని అన్నారు.

MLA Malla Reddy:  ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు: మల్లారెడ్డి

హైదరాబాద్: బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) విమర్ళలు గుప్పించారు. బుధవారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో (Parliamentary Constituency Meeting) పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తామే గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వాళ్ళు చేసిందేమీ లేదని, ఓటు అడిగే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని అన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓటు అడుగుతారని ప్రశ్నించారు. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేసామా అని ప్రజలు అనుకుంటున్నారని, ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదన్నారు. మళ్ళీ కేసీఆర్ (KCR) అధికారంలోకి రావాలని, ఆయన సీఎం అయితే ప్రాజెక్టుల్లో నీళ్ళు వస్తాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 01:16 PM