Share News

Jupalli Krishanrao: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 06 , 2024 | 02:26 PM

Telangana: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తన ఫోన్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ‘‘గతంలో నా ఫోన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా ఫోన్ నుండి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు జరిగింది. దీనిపై గతంలో మేము ఫిర్యాదు చేశాము’’ అని తెలిపారు.

Jupalli Krishanrao: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణలో (Telangana) ఫోన్‌ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) స్పందించారు. తన ఫోన్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ‘‘గతంలో నా ఫోన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా ఫోన్ నుండి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు జరిగింది. దీనిపై గతంలో మేము ఫిర్యాదు చేశాము. మా దగ్గర ఉన్న ఆధారాలు దర్యాప్తు అధికారులకు ఇచ్చాము. ఫోన్‌లు ట్యాప్ చేశారు అనే దానికి ఇది ఉదాహరణ. ఈ అంశంలో ఎవరిని వదిలేది లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల


కేసీఆర్‌పై విమర్శలు..

అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా జూపల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు అయిందని.. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నారన్నారు. కేసీఆర్ చవట, దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని ఎలా లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రశ్నించారు. 2014 నుంచి మొన్నటి వరకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. నాలుగు వేల పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చామని.. ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహనికి వెయ్యి గజాల లోపల పాతి పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టంపై మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ పంట నష్టం ఇచ్చిందని..కరువు వచ్చిన రైతులను ఆదుకుందని గుర్తుచేశారు. ‘‘గద్దలాగా వాలుతాం అన్న నీవూ నీ కుటుంభం ఇప్పటికే గద్దల్లాగా తినేశారు. గతంలో కుర్చీ వేసుకొని చేయిస్తా అని చాల హామీలు ఇచ్చావ్. మళ్లీ కొత్తగా అదే పాట పడుతున్నావ్. పదేళ్లు సీఎంగా పని చేసిన నువ్వు పాలమూరుకు ఎమ్ చేసావో చెప్పు . మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగింది’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..

AP Politics: ఎమ్మెల్యేగా రఘురామ.. ఎక్కడనుంచి పోటీ చేయనున్నారంటే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 02:36 PM