Share News

Mallu Ravi: మల్లికార్జున ఖర్గేని కలిసిన మల్లు రవి

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:54 PM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjunakharge ) ని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) ఢిల్లీలో శుక్రవారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను, ప్రభుత్వ పనితీరును మల్లు రవి వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలవుతున్న పథకాలను తెలియజేశారు.

Mallu Ravi: మల్లికార్జున ఖర్గేని  కలిసిన మల్లు రవి

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjunakharge ) ని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) ఢిల్లీలో శుక్రవారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను, ప్రభుత్వ పనితీరును మల్లు రవి వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలవుతున్న పథకాలను తెలియజేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌‌రెడ్డి పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 14 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వివరించారు. అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడినట్లు మల్లికార్జున ఖర్గేకి మల్లు రవి తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 10:54 PM