Share News

Delhi Liquor Scam: కవిత రిమాండ్ అప్లికేషన్‌లో సీబీఐ ఏం చెప్పిందంటే...

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:09 AM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నేటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీబీఐ కోరింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే...14 రోజులు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ రిమాండ్ అప్లికేషన్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని అందులో పేర్కొంది.

Delhi Liquor Scam: కవిత రిమాండ్ అప్లికేషన్‌లో సీబీఐ ఏం చెప్పిందంటే...
CBI Ramand Application

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నేటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో (Delhi Rouse Avenue Court) సీబీఐ అధికారులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీబీఐ (CBI) కోరింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే...14 రోజులు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ రిమాండ్ అప్లికేషన్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని అందులో పేర్కొంది.

AP Elections: జగన్‌పై దాడికి అసలు కారణం అదేనా.. వాళ్లకు ముందే తెలుసా..!


రిమాండ్ అప్లికేషన్‌లో మరిన్ని అంశాలు...

శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించామని.. లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పిందని చెప్పుకొచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపైనా ప్రశ్నించినట్లు తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి అని అన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతున్నామని రిమాండ్ అప్లికేషన్‌లో సీబీఐ పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు..

Road Accident: వేగంగా దూసుకెళుతున్న నిస్సాన్ కారు.. ఒక్కసారిగా ప్రమాదం.. ఆపై ఏం జరిగిందంటే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 11:11 AM