Share News

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత వాటర్ తాగాలో తెలుసా?

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:52 AM

Kidney Health in Summer: వేసవి కాలం(Summer) వచ్చేసింది. చాలా మంది బయట పని చేసే వారు ఉంటారు. ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరిగిపోవడం వల్ల ప్రజల శరీరం డీహైడ్రేట్‌కు(Dehydration) గురవుతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Issues) తలెత్తుతాయి. ముఖ్యంగా కిడ్నీ(Kidney) సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత వాటర్ తాగాలో తెలుసా?
Summer Health Care Tips

Kidney Health in Summer: వేసవి కాలం(Summer) వచ్చేసింది. చాలా మంది బయట పని చేసే వారు ఉంటారు. ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరిగిపోవడం వల్ల ప్రజల శరీరం డీహైడ్రేట్‌కు(Dehydration) గురవుతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Issues) తలెత్తుతాయి. ముఖ్యంగా కిడ్నీ(Kidney) సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఈ సీజన్‌లో అధికంగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. నీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. వేసవి కాలంలో సరిపడా నీళ్లు తాగకపోతే.. ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కిడ్నీలు దెబ్బతింటే.. శరీరంలోని మిగతా అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే.. నీరు అవసరమైనంత తాగాలని సూచిస్తున్నారు.


కిడ్నీ పనితీరుపై నీటి ప్రభావం..

రక్తం నుండి టాక్సిన్స్, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడం, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే.. కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే.. తగినంత నీరు తాగాలి. రోజుకు సరిపడా నీళ్లు తాగకపోతే.. కిడ్నీల సాధారణ పనితీరులో సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయి.

రోజుకు ఎన్ని గ్లాసుల వాటర్ తాగాలి..

వైద్య నిపుణుల ప్రకారం.. రోజుకు కనీసం ఎనిమిది నుంచి 12 గ్లాస్‌ల వాటర్ తాగిలి. కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. ముఖ్యంగా వేసవిలో చెమట నష్టం అధికంగా ఉంటుంది. ఆలాంటి సమయంలో మరిన్ని నీళ్లు తాగాల్సి ఉంటుంది. జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం గానీ తప్పకుండా తాగాలి.


హైడ్రేట్‌గా ఉండేందుకు 5 చిట్కాలు..

క్రమం తప్పకుండా నీరు త్రాగడం: రోజంతా నీరు బాగా తాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేసే అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. వాటర్ తాగడం మరిచిపోతున్నట్లయితే.. ఫోన్‌లో రిమైండర్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ ఇన్‌టేక్ యాప్ రిమైండర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వలన బయట ఉన్నప్పుడు లేదా ఎండలో ఉన్నప్పుడు నీటిని తాగే విషయంలో అలర్ట్ చేస్తుంటుంది.

మూత్రం రంగు, ఫ్రీక్వెన్సీని పర్యవేక్షించడం: డీహైడ్రేషన్ స్థితిని గమనించేందుకు మూత్రం రంగును ఎప్పుడూ గమనిస్తుండాలి. మూత్రం లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే.. నీటిని అధికంగా తాగాలి.

వెంట బాటిల్ తీసుకెళ్లండి: మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నట్లయితే.. మీ వెంట వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లండి. అర్థగంటకొకసారి వాటర్ సిప్ సిప్‌గా వాటార్ తాగుతుండాలి.

జ్యూస్: కొంతమంది ఎక్కువగా నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. అలాంటి వారు.. నీటి శాతం అధికంగా ఉన్న తాజా పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమం. దోసకాయ, నిమ్మకాయం, పూదీనా జ్యూస్, తాజా పండ్ల రసాలు కూడా తాగొచ్చు.

హైడ్రేటింగ్ ఫుడ్స్: మీరు తినే ఆహారం కూడా హైడ్రేటింగ్‌గా ఉండేలా చూసుకోవాలి. పుచ్చకాయం, దోసకాయ, ద్రాక్ష వంటి వాటిని తినాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

కళ్లకు కంప్యూటర్ కష్టాలు.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు..

ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు పోయినట్లే

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 10:52 AM