Share News

KTR: కారు షెడ్డుకు వెళ్లలేదు.. సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లింది

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:21 PM

పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని గత ఎన్నికల్లో సరిగా పట్టించుకోలేదని ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు.

KTR: కారు షెడ్డుకు వెళ్లలేదు.. సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లింది

హైదరాబాద్: పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని గత ఎన్నికల్లో సరిగా పట్టించుకోలేదని ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగతంగా నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు. కారు షెడ్డుకు వెళ్లలేదని.. సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు నివ్వలేకపోయామని... దీనికీ పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. నియోజవర్గాలల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుడికే చేరడంతో ఓటరు, కార్యకర్తకు లింకు తెగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని.. అయినా ఈ విషయాన్ని జనంలోకి తీసుకోని పోలేకపోయామన్నారు. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వారు ఓపిక పట్ట లేక అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారని.. ఇతర కులాల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. రైతుబంధు తీసుకున్న సామాన్య రైతు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి రైతు బంధు ఇవ్వడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారని చెప్పారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదన్నారు. పార్టీ నాయకులు ఇకనుంచి అలా మాట్లాడకూడదని సూచించారు. రెండు సార్లు ప్రజలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ప్రతిరోజు సమీక్ష సమావేశాల సారాంశాన్ని ఏరోజు కారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదికిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 04:21 PM