Share News

CM Revanth Reddy: సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ABN , Publish Date - May 15 , 2024 | 11:13 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు.

CM Revanth Reddy: సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సచివాలయం (Secretariat)లో కీలక సమీక్ష (Review) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tumma Nageswararao)తో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు.


రుణమాఫీకి కార్యాచరణ మొదలు

రుణమాఫీకి (Loan waiver) కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. డెడ్ లైనుకు ముందే రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఛాలెంజ్‌ను నెరవేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం రూ. 32 వేల కోట్ల వరకు ప్రభుత్వనికి నిధులు అవసరమవుతాయి. త్వరలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఆర్బీఐ నిబంధలకు లోబడి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధ్యా సాధ్యాలపై ఈరోజు బ్యాంకర్లు , వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 నుంచి రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.


కాగా బుధవారం నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న (మంగళవారం) చిట్ చాట్‌లో తెలిపిన విషయం తెలిసిందే.. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కూడా.. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు.


మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రుణమాఫీపై ఫోకస్, విద్యాశాఖ, అన్ని హస్టల్స్‌కు సన్న బియ్యం అందించే దిశగా ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీపై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. కాంగ్రెస్‌పై ఎవరు ఏన్ని విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 15 , 2024 | 11:16 AM