Share News

BJP: రాష్ట్రంలో ఆర్‌బీ ట్యాక్స్ నడుస్తోంది: మహేశ్వరరెడ్డి

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:51 PM

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్‌బీ టాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ఆర్.. అంటే రాహుల్, రేవంత్ రెడ్డి టాక్స్..బీ.. అంటే భట్టి విక్రమార్క టాక్స్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు.

BJP: రాష్ట్రంలో ఆర్‌బీ ట్యాక్స్ నడుస్తోంది: మహేశ్వరరెడ్డి

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Reventh Reddy Govt.)పై బీజేపీ (BJP) శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి‌ (Maheswara Reddy) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. రాష్ట్రంలో ఆర్‌బీ టాక్స్ (RB Tax) నడుస్తోందని ఆరోపించారు. ఆర్ (R).. అంటే రాహుల్ (Rahul), రేవంత్ రెడ్డి టాక్స్ (Revanth Reddy Tax)..బీ (B).. అంటే భట్టి విక్రమార్క టాక్స్ (Bhatti Vikramarka Tax) అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికి ఒకరు మాట్లాడుకునే ఆర్‌బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. టోల్ గేట్‌లో వసూలు చేసినట్లుగా.. కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) ప్లాన్ చేస్తోందని, రైతుబంధు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని మహేశ్వరరెడ్డి అన్నారు.13 వారాల్లో వారానికి వెయ్యి కోట్ల చొప్పున..13 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారన్నారు. మరో రూ. 4 వేల కోట్ల బాండ్ల ద్వారా అప్పులు తెచ్చారన్నారు. అడ్డగోలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేస్తుందని మహేశ్వరరెడ్డి విమర్శించారు.

Updated Date - Apr 08 , 2024 | 01:54 PM