Share News

ACB: భవన నిర్మాణం కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు

ABN , Publish Date - May 31 , 2024 | 08:39 PM

భవన నిర్మాణంకోసం ఎన్‌ఓసీ ఇవ్వడానికి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ACB: భవన నిర్మాణం కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు

రంగారెడ్డి: భవన నిర్మాణంకోసం ఎన్‌ఓసీ ఇవ్వడానికి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ సమయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. జిల్లా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన నలుగురు అధికారులను అరెస్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.

భవన నిర్మాణంకోసం ఎన్‌ఓసీ ఇవ్వడానికి రూ.3 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ భన్సీ‌లాల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్తీక్, నికేష్ కుమార్‌తోపాటు సర్వేర్ గణేష్‌ని అరెస్టు చేశామని అన్నారు. రెండున్నర లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ముందుగా లక్షన్నర ఇవ్వాలంటూ బాధితుడిని డిమాండ్ చేశారన్నారు. మరో రూ. 40వేలు సర్వర్ గణేష్ డిమాండ్ చేసినట్లు గుర్తించామని అన్నారు. అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు.

ఈ కేసు చూసిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పలువురు అధికారులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. బాధితులు ఎవరైనా కూడా ఏసీబీకి నేరుగా ఆశ్రయించవచ్చని చెప్పారు. ట్రాప్ కేసులో బాధితులు డబ్బులను ఏసీబీనే నేరుగా క్లియర్ చేస్తుందన్నారు. ట్రాప్ అయిన నగదును కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. కేసు క్లియర్ అయిన తర్వాత కోర్ట్ అనుమతితో ఏసీబీ అకౌంట్లోకి అమౌంట్ జమ అవుతుందని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 08:39 PM