Share News

Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:14 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. తమకు భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని.. భవిష్యత్‌లో వచ్చేది మళ్లీ తామేనని హరీష్‌రావు అన్నారు.

Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమకు భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని.. భవిష్యత్‌లో వచ్చేది మళ్లీ తామేనని అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో పావలా వంతుకు మించి అమలు చేయలేరన్నారు. మల్కాజిగిరిలో ఎంపీగా రేవంత్‌రెడ్డి తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ హామీలు అయలు చేయాలని హరీష్‌రావు చెప్పారు.

ఎన్నికల కోడ్ బూచీగా చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా వేయాలని చూస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్లీ అధికారంలోకి రాదని.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని హరీష్‌రావు మండిపడ్డారు.

Updated Date - Jan 21 , 2024 | 10:14 PM