Share News

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు.. ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

ABN , Publish Date - Jan 29 , 2024 | 09:48 PM

ఈ నెల 25వ తేదీ నుంచి గొంతు నొప్పి, దగ్గు మరియు జ్వరంతో బాధపడుతున్నానని తెలంగాణ శాసన సభ పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు.

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు..  ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

హైదరాబాద్: ఈ నెల 25వ తేదీ నుంచి గొంతు నొప్పి, దగ్గు మరియు జ్వరంతో బాధపడుతున్నానని తెలంగాణ శాసన సభ పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుంచి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్స పొందుతున్నానని తెలిపారు. అనారోగ్యంతో ఉండటంతోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26వ తేదీ సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అతిథ్యం ఇచ్చిన “AT HOME” కార్యక్రమానికి కూడా వెళ్లలేదని తెలిపారు.

అదే విధంగా ముంబాయిలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరుగుతున్న ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు కూడా వెళ్లలేదని చెప్పారు. 26వ గణతంత్ర దినోత్సవం రోజున శాసన పరిషత్తు కార్యాలయం నందు ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని.. శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే తనను అడిగారని తెలిపారు. ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారానికి సమయం అడిగారని.. అందుకు తాను అంగీకరించానని... వీలయితే అదే రోజు మిగతా ఎమ్మెల్సీలతో కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేడు కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ సమాచారం ఇవ్వకుండా తమ కార్యాలయానికి వచ్చారన్నారు. శాసన మండలి చైర్మన్‌గా నిక్ష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. మీడియా తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు.

Updated Date - Jan 29 , 2024 | 09:48 PM