Share News

Hyderabad: ఓరి దుర్మార్గుడా.. దాహం వేస్తోందని ఎంత పని చేశాడంటే..!

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:05 AM

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాహంగా ఉందని, నీళ్లు కావాలని అడిగిన ఓ దుండగుడు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకుని(Robbery) పారిపోయాడు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌(Alwal Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మచ్చబొల్లారం(Bollaram) అంజనాపురి కాలనీకి చెందిన..

Hyderabad: ఓరి దుర్మార్గుడా.. దాహం వేస్తోందని ఎంత పని చేశాడంటే..!
Robbery at Alwal

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాహంగా ఉందని, నీళ్లు కావాలని అడిగిన ఓ దుండగుడు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకుని(Robbery) పారిపోయాడు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌(Alwal Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మచ్చబొల్లారం(Bollaram) అంజనాపురి కాలనీకి చెందిన సుంచు సుగుణమ్మ(70) ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాహంగా ఉందని, నీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆ వృద్ధురాలు నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లగానే ఆ దుండగుడు అనుసరించి బంగారం గొలుసు, కమ్మలు ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె చెవి కమ్మలతోపాటు మెడలో ఉన్న బంగారు గొలుసు (మొత్తం 1.5 తులాలు) తీసి ఇచ్చింది. వెంటనే అతను పారిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 10:05 AM