Share News

CPI: బెడ్‌రెస్ట్‌లో సీపీఐ నేత నారాయణ.. ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:32 AM

Telangana: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

CPI: బెడ్‌రెస్ట్‌లో సీపీఐ నేత నారాయణ.. ఏం జరిగిందంటే?

హైదరాబాద్, మార్చి 19: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ (CPI Leader Narayana) ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నారాయణకు చికిత్స చేసిన వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి అవసమని చెప్పారు. ఆ సందర్భంలో నొప్పి ఎక్కువ కావడంతో ఏఐజీ డాక్టర్లను సంప్రదించగా రిబ్ ఎముక విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించి రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని తెలిపారు. ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి...

CBN Vs Jagan: అన్ని వర్గాల్లో అసంతృప్తి.. వైసీపీ నేతల్లో కలవరం..

KTR: సీఎం గారు.. రైతులంటే ఎందుకింత చిన్నచూపు?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 20 , 2024 | 11:32 AM