Share News

TS News: తెలంగాణలో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:14 PM

Telangana: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. టీపీసీసీ నేత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

TS News: తెలంగాణలో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై (AP MP Vijayasaireddy) టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత (TPCC spokesperson Kalva Sujatha) ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. టీపీసీసీ నేత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 3 నెలల్లో కూలిపోతుందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఆన్‌రికార్డ్‌లో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత పోలీసులకు కంప్లైంట్ చేశారు.


ఇది వారి కుట్రే...

అనంతరం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో సుజాత మాట్లాడుతూ... బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు బీఆర్‌ఎస్ ఫండింగ్ ఇస్తోందని.. ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని.. ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. విజయ్ సాయి రెడ్డి వాఖ్యలపై సీబీఐతో విచారణ చేయాలని.. రాజ్యసభ చైర్మన్ చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 04:36 PM