Share News

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

ABN , Publish Date - Apr 11 , 2024 | 01:57 PM

Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈడీ కస్టడీలో తీహార్ జైలులో ఉండగానే రంగంలోకి దిగిన సీబీఐ విచారించింది. తీహార్ జైలు వేదికగా జరిగిన ఈ విచారణ తర్వాత కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది.. కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్టయిన కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయ్యింది. అటు ఈడీ.. ఇటు సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటుచేసుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


వాట్ నెక్స్ట్!

ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీహార్ జైల్‌లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్-06న సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి..? అన్ని కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి..? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్రేంటి..? తెరవెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు..? అని చాలా లోతుగా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది. ఈ వరుస అరెస్టులతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలు ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న ‘కారు’ పార్టీకి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా వ్యవహారంపై బీఆర్ఎస్ ఏం చేయబోతోంది..? అనేదానిపై పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Apr 11 , 2024 | 04:50 PM