Share News

BRS: శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చర్చించబోతున్నారంటే..

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:04 PM

Telangana: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు(శుక్రవారం) ఉదయం 11గంటలకు జరుగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు.

BRS: శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చర్చించబోతున్నారంటే..

హైదరాబాద్, జనవరి 25: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (BRS Parliamentary Party meeting) సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జరుగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR), మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister HarishRao) హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై రేపటి సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 25 , 2024 | 12:46 PM