Share News

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:39 PM

BRS Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన జనగాం దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు.. స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించిన నేతలు దగ్గరుండి టైర్ మార్పిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం తర్వాత మరో బస్సులో ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయల్దేరి వెళ్లారు.


BRS-Bus.jpg

Updated Date - Mar 01 , 2024 | 01:01 PM