Share News

Laxman: రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ రిఫరెండంగా ప్రకటిస్తారా..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:55 PM

Telangana: అధికార కాంగ్రెస్ పార్టీ అబధ్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగురున్నాయని.. రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు. మజ్లిస్‌ను గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు.

Laxman: రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ రిఫరెండంగా ప్రకటిస్తారా..!
BJP MP Laxman

హైదరాబాద్, ఏప్రిల్ 12: అధికార కాంగ్రెస్ పార్టీ(Congress) అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగురున్నాయని.. రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు. మజ్లిస్‌ను గెలిపించమని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..


మజ్లీస్‌కు సపోర్ట్ చెయ్యడం హనుమంతరావు (congress Leader V.Hanumanth Rao) లాంటి వ్యక్తులకు ఇష్టం లేదన్నారు. సొంత నేతల వలనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీలకు కొమ్ము కాసే వ్యక్తులు జైళ్లలో ఉన్నారన్నారు. హామీల విషయంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. అబద్ధాలకు కాంగ్రెస్, అహంకారనికి బీఆర్ఎస్‌లు మారుపేరు అంటూ విమర్శలు గుప్పించారు. తనపై, తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ (Raghul Gandhi) ప్రధాన మంత్రి అవుతారని కాంగ్రెస్ రిఫరెండంగా ప్రకటిస్తారా..! అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 12 , 2024 | 01:46 PM