Share News

BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి మోదీ

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:49 PM

పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పై బీజేపీ ( BJP ) ఫోకస్ పెట్టింది. ఇసారి ఎలాగైనా అధికంగా ఎంపీ స్థానాలను గెలవాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర‌ మోదీ ( PM MODI ) సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ( Congress ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీలకు చెక్ పెట్టేలా సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి మోదీ

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పై బీజేపీ ( BJP ) ఫోకస్ పెట్టింది. ఇసారి ఎలాగైనా అధికంగా ఎంపీ స్థానాలను గెలవాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర‌ మోదీ ( PM MODI ) సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ( Congress ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీలకు చెక్ పెట్టేలా సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒకటి.. దక్షిణ తెలంగాణలో మరొక సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోదీ సభలపై తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తోన్నారు. రేపు బీజేపీ ముఖ్యనేతల కీలక సమావేశం నిర్వహించనున్నారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్యనేతలు హాజరవుతున్నారు. నేతల మధ్య గ్యాప్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సమన్వయం చేసే బాధ్యతను బీజేపీ అగ్రనేత అమిత్ షా కిషన్‌రెడ్డికి అప్పగించారు.పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సమావేశం నిర్వహించనున్నారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కిషన్‌రెడ్డి భావిస్తోన్నట్లు సమాచారం.

Updated Date - Jan 07 , 2024 | 11:49 PM